Hydraa Commissioner Ranganath Challenge : 26 లోగా బ‌తుక‌మ్మ కుంట‌లో బోటు షికారు

స‌ర్వాంగ‌సుంద‌రంగా మారాలంటూ ఆదేశం

Hello Telugu - Hydraa Commissioner Ranganath Challenge

Hello Telugu - Hydraa Commissioner Ranganath Challenge

Hydraa Commissioner Ranganath : హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని బ‌తుక‌మ్మ కుంట‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ (Hydraa Commissioner Ranganath) సంద‌ర్శించారు. ఈ నెల 26న జ‌ర‌గ‌నున్న బ‌తుక‌మ్మ ఉత్స‌వ ఏర్పాట్ల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బ‌తుక‌మ్మ కుంట‌ను న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అంకితం ఇవ్వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. 26 నాటికి బ‌తుక‌మ్మ కుంట‌తో పాటు ప‌రిస‌రాలు స‌ర్వాంగ సుంద‌రంగా మారాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హ‌నుమంత‌రావు కూడా బ‌తుక‌మ్మ‌కుంటను సంద‌ర్శించి.. హైడ్రా ప‌ని తీరును ప్ర‌శంసించారు.

Hydraa Commissioner Ranganath Comments

బ‌తుక‌మ్మ కుంటను చూస్తుంటే ఇది క‌లా నిజమా అనేది అర్ధం కావ‌డం లేద‌ని స్థానికులు ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్ర‌భుత్వం ఎంతో శ్ర‌ద్ధ తీసుకుని ఈ బాధ్య‌త‌ను హైడ్రాకు అప్ప చెప్పింద‌న్నారు వి. హ‌నుమంత రావు. ఆ ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేసింద‌ని కొనియాడారు. త‌ర్వాత బ‌తుక‌మ్మ కుంట‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు బోటులో విహ‌రించారు. హైడ్రా అడ్మిన్ ఎస్‌. పి. ఆర్. సుద‌ర్శ‌న్ గారు, వి. హ‌నుమంత‌రావు కూడా క‌మిష‌న‌ర్‌తో పాటు విహ‌రించిన వారిలో ఉన్నారు. షికారు అనంత‌రం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా స‌రే శుక్ర‌వారం లోపు బ‌తుక‌మ్మ కుంట‌లో బోటు షికారు పూర్త‌వుతుంద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు.

Also Read : Minister Savitha Strong Focus : పట్టు సాగు పెంచేలా చర్యలు : స‌విత

Exit mobile version