Minister Savitha Strong Focus : పట్టు సాగు పెంచేలా చర్యలు : స‌విత

హిందూపురంలో ఎస్సీడీపీ సెంటర్

Hello Telugu - Minister Savitha Strong Focus

Hello Telugu - Minister Savitha Strong Focus

Minister Savitha : అమ‌రావ‌తి : కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి తీపి క‌బురు చెప్పింద‌న్నారు మంత్రి ఎస్. స‌విత (Minister Savitha ) . బుధ‌వారం త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ సంద‌ర్బంగా త‌న‌తో క‌లిసి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురంకు కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన స్మాల్ క్ల‌స్టర్ డెవ‌ల‌ప్మెంట్ ప్రోగ్రాం ను మంజూరు చేసిందన్నారు. దేశంలోనే అత్య‌ధికంగా ఇక్క‌డ నేత‌న్న‌లు ఉన్నార‌ని చెప్పారు మంత్రి ఎస్. స‌విత‌. ఇక్క‌డ ప‌ట్టు ప‌రిశ్ర‌మ గ‌త కొన్నేళ్లుగా విరాజిల్లుతోంద‌ని పేర్కొన్నారు. ఇక్క‌డి నేత కార్మికుల‌కు మ‌రింత మెరుగైన‌, అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందించేందుకు శిక్ష‌ణ ఇస్తామ‌న్నారు.

Minister Savitha Comments

సిల్క్ శారీలో పట్టు ఎంతో కీలకమని మంత్రి సవిత తెలిపారు. సిల్క్ శారీ తయారీలో అవసరమైన పట్టు రాష్ట్రంలో ఉత్పత్తి కావడం లేదని, దీంతో బెంగుళూరు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు మంత్రి స‌విత‌. రాష్ట్రంలో పట్టు సాగు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇతర ఏ పంటల్లో లేనంత రాబడి పట్టు సాగులో వస్తోందని, దీనిపై రైతుల్లో అవగాహన కల్పించనున్నామని తెలిపారు. పట్టు ఉత్పత్తి పెంచి, తద్వారా సిల్క్ చీరల తయారీలో ఏపీ బ్రాండ్ పెంచేలా నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సెరీ కల్చర్ డైరెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : YS Jagan New Digital Book Sensational : బాధితుల కోసం భ‌రోసా డిజిట‌ల్ బుక్ ఆస‌రా : జ‌గ‌న్

Exit mobile version