Hydraa Breakthrough : హైడ్రాకు ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదుల వెల్లువ‌

హైడ్రా ప్ర‌జా వాణికి 61 ద‌ర‌ఖాస్తులు

hellotelugu-hydraa

Hydraa : హైద‌రాబాద్ – హైడ్రా దూకుడు పెంచింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తీసుకున్న నిర్ణ‌యం స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. ఆయ‌న ప్ర‌తి సోమ‌వారం ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డిన వారి గురించి, బాధితులు ఎవ‌రైనా స‌రే త‌మ గోడు విన‌తిప‌త్రాల ద్వారా ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు హైడ్రా ప్ర‌జావాణి నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు హైడ్రా (Hydraa) ఆఫీసుకు. మొత్తం 61 ఫిర్యాదులు అందాయి. ఆక్ర‌మ‌ణ ఎంత‌టిదైనా.. అవ‌త‌లి వారు ఎంత‌టివారైనా, న‌గ‌ర ప్ర‌జ‌లు వెనుకాడ‌డం లేదు. వ‌ర‌ద కాలువ‌లు, చెరువులు, ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు ఇలా ఎక్క‌డ ఏవి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైనా ప్ర‌జావాణికి వ‌చ్చి వివ‌రాలందిస్తున్నారు.

Hydraa Prajavaani

ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆధారాల‌తో ఇస్తున్నారు. దీంతో వాటిని గుర్తించ‌డం మ‌రింత సులువుగా మారింది హైడ్రా అధికారుల‌కు. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌ ప‌రిశీలించారు. గూగుల్ మ్యాప్స్‌లో గ‌తంలో ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా మారిందో వివ‌రాల‌ను తెలుసుకున్నారు. ఫిర్యాదు దారుల ముందే ఆ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. సంబంధిత అధికారుల‌కు ఆ స‌మ‌స్య ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల రామారం గ్రామంలోని స‌ర్వే నంబ‌రు 307/1, 308/2,3,5లో ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లం క‌బ్జాకు గురైంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. 271 ఎక‌రాల‌కు పైగా ఉన్న ఈ భూమి తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన‌దిగా ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. గ‌తంలో ఎపీఎస్ ఎఫ్‌సీకి చెందిన ఈ భూమిని తెలంగాణ ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోగా అక్క‌డ క‌బ్జాదారులు చ‌క్రం తిప్పుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌భుత్వ భూమిలో ఆక్ర‌మ‌ణ‌లు రాకుండా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Also Read : Somireddy Fired on Perni Nani : పేర్ని నానికి సోయి లేదు – సోమిరెడ్డి

Exit mobile version