Somireddy : నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నానిపై. జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యల వలన రాజకీయాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నాని విలువలు లేకుండా నీఛంగా మాట్లాడటం దారుణమన్నారు. 40 ఏళ్ళకే నాపని అయిపోయిందని కొడుక్కి పగ్గాలు అప్పజెప్పిన వ్యక్తి పేర్ని నాని అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం సోమిరెడ్డి (Somireddy) మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించి కొడుక్కి కృష్ణా జిల్లా పగ్గాలు అప్పగించాలని పేర్ని నాని కుట్ర పన్నాడని సంచలన ఆరోపణలు చేశాడు.
Somireddy Chandra Mohan Reddy Slams Perni Nani
పేర్ని నాని వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందని, టీడీపీని రెచగొట్టాలని చూస్తున్నాడని అన్నారు. వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని, పేర్ని నాని వాడిన భాష సరైనది కాదు అని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిన పడ్డాయన్నారు. కానీ వైసీపీ, జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు, చర్యల వలన రాజకీయాలు మరింత సంక్లిష్టంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాల్లో రాజనాల కుట్రలు కుతంత్రాలు ఎలా ఉండేవో నేడు జగన్ రెడ్డి కుట్రలు అలా ఉంటున్నాయని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని వాపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? ప్రజలు ఛీ కొట్టినా ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు ఇలా మాట్లాడే వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊసలు లెక్కపెట్టి బ్రతుకు జీవుడా అంటూ బయటకి వచ్చాడని అన్నారు.
చంద్రబాబుకి 76 ఏళ్లంటూ హేళన చేస్తా ఎలా అని ప్రశ్నించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనతో పాటు రామతీర్థం, అలిపిరి కొండ ఎక్కగలవా? అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో చావును చూసి తిరిగొచ్చి హీరోగా నిలిబడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
Also Read : Mohammad Azharuddin Shocking Comments : హెచ్‌సీఏ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దం
