Hydraa : హైదరాబాద్ : హైదరాబాద్ లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నాలాల్లో వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను వినియోగించుకుని నాలాల్లో పూడికను పూర్తి స్థాయిలో తొలగించాలని హైడ్రా (Hydraa) డీఆర్ ఎఫ్, మెట్ టీమ్‌లకు కమిషనర్ ఏవీ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. నగర వ్యాప్తంగా నాలాల్లో పూడిక తీసే పనులను ముమ్మరం చేయాలని సూచించారు. చాలా వరకు పూడికను తొలగించడంతో ఈ ఏడాది భారీ వర్షాలు పడినా ఎక్కడా వరద ముప్పు ఏర్పడ లేదని అన్నారు. వచ్చే ఏడాది అస్సలు ఈ సమస్య తలెత్తే అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు కమిషనర్. ప్రజావాణి ఫిర్యాదుల మేరకు నగరంలోని నాలాలను, చెరువులను పరిశీలిస్తూ వస్తున్నారు రంగనాథ్.
Hydraa Key Update
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాలలో నాలాల్లో పూడిక తీత పనులను పర్యవేక్షించారు. నాలాల్లో పూడిక తీత పనులకు, వరద ప్రవాహానికి ఆటంకాలను తొలగించేందుకు ఇదే సరైన సమయంగా భావిచాలని హితవు పలికారు. అలాగే ప్రాంతాల వారీ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి సమాచారాన్ని చేర వేయాలని సూచించారు కమిషనర్ ఏవీ రంగనాథ్. అలాగే హరిహరపురంలోని కాప్రాయి చెరువుతో పాటు శంషాబాద్, పెద్దగోల్కొడలోని నరసింహ చెరువు, బాలాపూర్ మండలంలోని కోమటి కుంటను పరిశీలించారు. వర్షాకాలం ఏ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిందనేది ఇప్పటికే తెలిసిందని, వచ్చే ఏడాది అలాంటి అవకాశం లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు హైడ్రా (Hydraa), జీహెచ్ఎంసీ అధికారులకు.
నగరంలో చెరువులను అభివృద్ధి చేసి వరదలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువులను తగిన మొత్తంలో ఖాళీ చేయించి వరద నీరు నిలిచేలా చూడాలన్నారు.
Also Read : US VP JD Vance Clear Update : క్రైస్తవురాలు కాదు మతం మారే ఆలోచన లేదు


















