చెన్నై : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ , బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు దేశ వ్యాప్తంగా బూస్ట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో తనకు సీటు కూడా కేటాయించ లేదు. ప్రత్యేకించి రాష్ట్రంలో పొత్తులో భాగంగా అన్నాడీఎంకే తనకు ప్రయారిటీ ఇవ్వకుండా అడ్డుకుంది. చివరకు తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. తను కూడా విస్తృతంగా పర్యటించారు. కానీ వర్కవుట్ కాలేదు. మొత్త్ం 234 సీట్లకు గాను దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. మొత్తం 108 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ , వీసీకే, తదితర పార్టీలతో కలిసి కూటమి సర్కార్ ను ఏర్పాటు చేసింది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి బీజేపీ హైకమాండ్ ప్రత్యేకించి కేంద్ర మంత్రి , ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా వ్యూహ రచనతో కె అన్నామలైని రాజీనామా చేయించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాలలో. బీజేపీని ఎట్టి పరిస్తితులలో తమిళనాడు ప్రజలు స్వీకరించని తేలి పోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఇప్పటి నుంచే తమిళ అస్తిత్వంతో పాటు జాతీయ వాదం కలిసేలా ఓ పార్టీని కె. అన్నామలైతో చేయిస్తే ఎలా ఉంటుందోనని ఓ ప్రయోగాత్మకంగా ప్లాన్ చేసినట్లు టాక్. ఇది పక్కన పెడితే సుదీర్ఘ లేఖ రాశాడు కె. అన్నామలై. తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాడు. రాజీనామా చేస్తున్నానని, తాను స్వంతంగా పార్టీ పెడుతున్నట్లు వెల్లడించాడు. మొత్తంగా విజయ్ కు ప్రత్యామ్నాయంగా జెన్ జీ యువత ను ఆకర్షించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


















