న్యూఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై సంచలనంగా మారారు. న్యూఢిల్లీలో ఆయన ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తన రాజీనామా గురించి ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. తాను ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించ వచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో, పార్టీ నాయకత్వాన్ని కలిసేందుకు అన్నామలై ఢిల్లీకి వచ్చారు. కాషాయ పార్టీని వీడతారనే ఊహాగానాల నడుమ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్నామలై-షా భేటీ సుమారు 30 నిమిషాల పాటు సాగింది. అయితే, ఈ సమావేశంలో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో వెంటనే తెలియ రాలేదు.
సమావేశం ముగిసిన తర్వాత అన్నామలై మీడియాతో మాట్లాడకుండానే షా నివాసం నుండి వెళ్లిపోయారు. అంతకు ముందు అన్నామలై బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లను కూడా కలిశారని, పార్టీకి రాజీనామా పత్రాన్ని సమర్పించారని పలు మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ, దీనిపై ఎటువంటి అధికారిక నిర్ధారణ కాలేదు. అయితే ఆయన ఇంకా రాజీనామా చేయలేదు అని పార్టీలోని ఒక వర్గం తెలిపింది. తనను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడం, తన స్తానంలో ననార్ నాగేంద్రనన్ ను నియమించినప్పటి నుంచి అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే తో పొత్తు పై కూడా ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నారు. చివరకు బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది.

















