Hydraa : హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములను కాజేసి అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేసే పనిలో పడింది. ఈ సందర్బంగా శనివారం కోలుకోలేని షాక్ ఇచ్చింది బిల్డర్ కు. ఈ ఘటన మియాపూర్ లో చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనం కూల్చివేసింది. అమీన్పూర్ లో అనుమతులు పొంది మియాపూర్ ప్రభుత్వ భూమి (HMDA కు చెందిన)లో అక్రమ కట్టడాలు చేపట్టారు. సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడ్డారు. హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126/D , 126/ part, 126/C గా ప్లాట్లు సృష్టించారు భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు.
Hydraa Demolished Miyapur Building
హైదరాబాద్ నగర పాలక సంస్థకు చెందిన భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. ఫేక్ ఎల్ఆర్ఎస్ ను సృష్టించినట్లు హైడ్రా (Hydraa) గుర్తించింది. డబ్బులు చెల్లింని డీడీ కూడా నకిలీదని తేల్చింది. ఇప్పటికే అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని పూర్తిగా శనివారం తొలగించారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ స్థలంలో నిర్మించినంత వరకు కూల్చి వేసినట్లు తెలిపారు హైడ్రా కమిషనర్. ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల భవనం నిర్మించినట్లు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ, HMDA, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Also Read : Jajula Srinivas Goud Shocking Comments : బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ ను ముట్టడిస్తాం
