Jajula Srinivas Goud Shocking Comments : బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం పార్ల‌మెంట్ ను ముట్ట‌డిస్తాం

హెచ్చ‌రించిన జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Jajula Srinivas Goud : హైద‌రాబాద్ : బీసీ జేఏసీ వ‌ర్కింగ్ చైర్మ‌న్ , ఏపీ బీసీ సంఘం అధ్య‌క్షులు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) , కేస‌న శంక‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుప్రీంకోర్టు విధించిన బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తి వేయాల‌ని అన్నారు. లేకపోతే పార్ల‌మెంట్ ను ముట్ట‌డిస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాదు లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు . తూ దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా సమగ్ర కులగనన చేపట్టాలని కోరుతూ వ‌చ్చామ‌న్నారు. ఇదే సమయంలో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్ర‌దేశ్ లో కూడా సమగ్ర కులగ‌ణ‌ను చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దామస్ ప్రకారం పెంచాలని పోరాటం చేశామ‌న్నారు. దీని ఫ‌లితంగానే తెలంగాణ రాష్ట్రంలో కుల గ‌ణ‌న జ‌రిగింద‌న్నారు.

Jajula Srinivas Goud Shocking Comments

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే సమగ్ర కులగ‌ణ‌న‌ చేపడతామని ప్రకటించడం జరిగిందని వారు వెల్లడించారు. అలాగే బీసీ సంఘాలు చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా ఢిల్లీలో పార్లమెంటు ముందు వందల సార్లు ధర్నాలు, ర్యాలీలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడించామని, దీనితో కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి దేశ వ్యాప్తంగా కులగ‌ణ‌న‌ చేపడతామని ప్రకటించిందని అన్నారు. ఇది ముమ్మాటికీ 100 శాతం బీసీ సంఘాలు చేసిన పోరాట ఫ‌లిత‌మేన‌ని పేర్కొన్నారు. కులగ‌ణ‌న‌ చేయడం, బీసీల లెక్క తేల్చడం బీసీల పోరాట పాక్షిక విజయమని అన్నారు.

Also Read : Hyderabad Press Club New Innovation : ప్రెస్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ గా మార్చుతాం

Exit mobile version