Hydraa Important Update : నిజాయతీ అందరి జీవన విధానం కావాలి

విజిలెన్స్ వారత్సవంలో హైడ్రా కమిషనర్

Hello Telugu - Hydraa Important Update

Hello Telugu - Hydraa Important Update

Hydraa : హైద‌రాబాద్ : స‌మాజంలో నిజాయితీ అనేది అంద‌రి జీవ‌న విధానం కావాల‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. వ్యవస్థల పట్ల, వాటి పని తీరుతో పాటు పౌరుల హ‌క్కుల‌కు సంబంధించి అందరి లోనూ అవగాహన ఉన్నప్పుడు అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుంద‌న్నారు. చ‌ట్టాల పైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు అనుస‌రించాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త వాటిని అమ‌లు చేసే వారిపై ఉంద‌న్నారు క‌మిష‌న‌ర్. గొలుసు క‌ట్టు చెరువుల ప్రాధాన్యత, నాలాల అవశ్యకత, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల పరిరక్షణ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలందరికీ తెలిసేలా హైడ్రా (Hydraa) చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు.

Hydraa Important Update

విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా బీహెచ్ఈఎల్ నిర్వహించిన కార్యక్రమంలో ఏవీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైడ్రా రాక ముందు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ పట్ల చాలా మందిలో అవ‌గాహ‌న లేద‌ని అన్నారు ఏవీ రంగ‌నాథ్. కానీ ఇప్పుడు న‌గ‌ర వాసుల్లో చైత‌న్యం వ‌చ్చింద‌న్నారు. ఇలా చేసేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తున్నామ‌న్నారు.. ఇప్పుడు దాదాపుగా అంద‌రికీ తెలిసేలా చేశామ‌న్నారు. ఇటీవ‌ల హైడ్రా వార్షికోత్స‌వంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌లో పాఠ‌శాల విద్యార్థులు చెరువుల ఎఫ్‌టీఎల్‌(ఫుల్ ట్యాంక్ లెవెల్‌) బ‌ఫ‌ర్‌, నాలాల బ‌ఫ‌ర్‌ను కాపాడాల్సిన అవ‌స‌రాన్ని క‌ళ్ల‌కు క‌ట్టార‌న్నారు. ప్ర‌జ‌లలో చైత‌న్యం రానంత వ‌ర‌కు అవినీతి , అక్ర‌మాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌న్నారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్.

Also Read : AP IPS Transfers Sensational : ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

Exit mobile version