AP IPS Transfers Sensational : ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

21 మందికి కొత్త‌గా పోస్టింగ్ లు ఇచ్చిన స‌ర్కార్

Hello Telugu - AP IPS Transfers Sensational

Hello Telugu - AP IPS Transfers Sensational

AP : అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆదివారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భారీ ఎత్తున పోలీస్ శాఖ‌లో బ‌దిలీలు చేప‌ట్టింది. ప‌లువురికి స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. ఇందులో భాగంగా 21 మందికి కొత్త పోస్టింగ్ లు ఇచ్చింది. పలు కీలక విభాగాలకు, జిల్లాలకు వీరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ గా మణికంఠ చందోలును బ‌దిలీ చేసింది . విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ గా కృష్ణకాంత్ పటేల్ కు ఛాన్స్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా ను నియ‌మించ‌గా ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె.శ్రీనివాసరావుకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇక ఏపీ (AP) అవినీతి నిరోధ‌క శాఖ‌కు జాయింట్ డైరెక్టర్ గా ఈ.జి.అశోక్ కుమార్ ను నియ‌మించంది ప్ర‌భుత్వం.

AP IPS Officers Transfer

విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా షేక్ బేగంను బ‌దిలీ చేయ‌గా సీఐడీ మహిళల భద్రత సెల్-2 ఎస్పీగా వి.రత్న,
ఐదో బెటిలియన్ కమాండెంట్ గా రవిశంకర్ రెడ్డి, సీఐడీ ఎస్పీగా ఆర్ గంగాధర్ రావు. ఏఐజీ ఆర్గనైజేషన్ గా డీజీపీ కార్యాలయంలో పనసారెడ్డి, ప్లానింగ్ అండ్ కో ఆర్డినేషన్ ఏఐజీగా వెంకటరత్నం, ఎన్టీఆర్ కమిషనరేట్ రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణను బ‌దిలీ చేసింది స‌ర్కార్. ఈగల్ యూనిట్ ఎస్పీగా కేఎం మహేశ్వర్ రాజు, సీఐడీ నుంచి సైబర్ క్రైమ్స్ కమిషనర్ గా కృష్ణప్రసాద్ , ఇంటెలిజెన్స్ సీఎంఎస్డీ ఎస్పీగా జగదీష్. చిత్తూరు అడిషనల్ ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా. శ్రీ సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీగా అంకిత మహావీర్, జంగారెడ్డి గూడెం ఏఎస్పీగా సుష్మిత, చిత్తూరు ఏఎస్పీగా హేమంత్ బొద్దు, పార్వతీపురం ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డిని నియ‌మించింది.

Also Read : KTR Fired on CM Revanth Reddy : సైన్యంపై సీఎం కామెంట్స్ కేటీఆర్ సీరియ‌స్

Exit mobile version