Hydraa Commission Shocking : బ‌డా బాబుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా ఉక్కుపాదం

హైడ్రా ప్ర‌జావాణిలో 64 ఫిర్యాదులు.

Hello Telugu - Hydraa Commission Shocking

Hello Telugu - Hydraa Commission Shocking

Hydraa : హైద‌రాబాద్ : బ‌డా బాబుల ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న సామాన్యులు హైడ్రా ప్ర‌జావాణిని ఆశ్ర‌యించారు. ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసుకుంటూ పోతుంటే గ‌తంలో మాదిరి గ‌మ్మున ఉండ‌ట్లేదు. ద‌శాబ్దాల స‌మ‌స్య‌ల‌కు వెనువెంట‌నే హైడ్రా (Hydraa) ప‌రిష్కారం చూప‌డంతో ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకొని వ‌చ్చి ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. లే ఔట్ల‌ను చూపించి ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్న తీరును వివ‌రిస్తున్నారు. కాల‌నీలోంచి సాఫీగా సాగిపోయే వ‌ర‌ద కాలువ‌ను.. బ‌డా బిల్డ‌ర్స్ అడ్డుకుంటున్న వైనాన్ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఇదే ప‌రిస్థితి ర‌హ‌దారుల విష‌యంలోనూ జ‌రుగుతోంది. లే ఔట్‌లోకి జ‌రిగి మ‌రీ ర‌హ‌దారుల‌ను కాజేసేస్తున్నారు.

Hydraa Commission Shocking

మూసాపేట ఆంజ‌నేయ‌న‌గ‌ర్‌లో క‌బ్జాల‌కు గురైన 2 వేల గ‌జాల పార్కును హైడ్రా కాపాడింది. ఇదిలా ఉండ‌గా దీనిని పార్కుగా అభివృద్ధి చేసే బాధ్య‌త‌ను కూడా హైడ్రా తీసుకోవాల‌ని అక్క‌డి నివాసితులు కోరారు. ఈ మేర‌కు హైడ్రా ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తు అంద‌జేశారు. కాగా హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి మొత్తం 64 ఫిర్యాదులు అందాయి. ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 7.30 వ‌ర‌కూ ప్ర‌జావాణికి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ప‌రిశీలించారు. ఇందుకు సంబంధించి స‌మ‌స్య ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్‌, రెవెన్యూ, స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా అక్క‌డ ప‌రిస్థితులు గ‌తంలో ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా మారాయి వివ‌రించి ప‌రిష్కార మార్గాలు సూచించ‌డంతో ఫిర్యాదుదారులు ఊర‌ట చెందారు.

Also Read : Minister Vangalapudi Anitha Clear Update : అన్న‌దాత‌ల‌కు రూ. 25 కోట్ల చెక్కులు పంపిణీ

Exit mobile version