HYDRAA : హైదరాబాద్ – పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ క్రమంలో చెరువుల పునరుద్ధరణను పెద్ద యెత్తున చేపడుతున్నామన్నారు. పర్యావరణ హితమైన నగరాల అభివృద్ధిని కాంక్షిస్తూ బయోఫిలిక్ అర్బనిజం వైపు అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు పేరుతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఏర్పాటు చేసిన దక్షిణ మండలి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. హైడ్రా (HYDRAA) ఉద్దేశాలను కమిషనర్ వివరించారు. నగరంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి, వరదల నివారణతో పాటు పర్యావరణ హితమైన నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈక్రమంలో చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించడంతో పాటు.. విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
HYDRAA Shocking Comments on Hyderabad
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రధాన కర్తవ్యం అయినా.. వీటిని నివారించే క్రమంలో చెరువుల పునరుద్ధరణ, కాలుష్య నివారణ అంశాలపై దృష్టి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలోనే 500ల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పారు ఏవీ రంగనాథ్. పార్కులను పునరుద్ధరించడం జరగిందని అన్నారు.. నగరంలో ఉన్న చెరువులన్నిటినీ పర్యావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని కమిషనర్ చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్ ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు అడిగన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీ అధికారులు ఇటీవలే భాగ్యనగరాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా హైడ్రా పనితీరును మెచ్చుకున్నారని చెప్పారు ఏవీ రంగనాథ్.
Also Read : Minister Ram Prasad Interesting Update : ఆంధ్రా యువ సంకల్ప్ – 2025 ప్రతిభకు వేదిక
