Minister Ram Prasad : విజయవాడ – ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువత కోసం ఒక అద్భుతమైన వేదిక సిద్ధమైంది. యువత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ యువతను వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా చేసుకొని ఆంధ్రా యువ సంకల్ప్ కు శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad). రాష్ట్ర యువతలోని సృజనాత్మకత, ఆవిష్కరణ, ప్రతిభ ప్రపంచ స్థాయిలో ప్రతిధ్వనించేందుకు గాను యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ యూట్యూబ్ అకాడమీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిజిటల్ మారథాన్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు.
Minister Ram Prasad Key Updates
ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సులభమాని పేర్కొన్నారు. సంబంధిత పోస్టర్లలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి,లేదా www.andhrayuvasankalp.com లో పేరు నమోదు చేసి, వీడియో లింక్ రూపంలో మీ ప్రతిభను అప్‌లోడ్ చేయాలని చూచించారు. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 10 వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువత తమ ప్రతిభను మూడు విభిన్న థీమ్‌లలో ప్రదర్శించవచ్చు. 1)#youthresponsibilities (Social Responsibilities & Family Relationships) (యువత సామాజిక బాధ్యత మరియు కుటుంబ సంబంధాలు మరియు కుటుంబ విలువలు.) , 2)#fityouthap (Fitness, Lifestyle, Sports & Nutrition) (మైండ్, బాడీ, హెల్త్, పౌష్ఠిక ఆహారం) , 3)#smartyouthap (artificial Intelligence& Digital Innovation) (టెక్నాలజీ వినియోగంలో అర్థవంతమైన మార్గాలు) అనే అంశాలపై నమోదు చేయాలన్నారు.
అయితే తప్పనిసరిగా #andhrayuvasankalp2k25, #viksitBharat2047, #youthministerap, #internationalyouthday, #smartyouthap, #swarnaandhra2047 , #youthiconnaralokesh హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించాలని స్పష్టం చేశారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ప్రతి థీమ్ లో టాప్ 3 వీడియోలు ఎంపిక చేయబడతాయని, విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులతో పాటు ప్రతిష్టాత్మక సర్టిఫికేట్ ప్రదానం చేస్తామన్నారు. అంతేకాక ANDHRA Youth Brand Ambassador 2025గా ఎంపిక చేయబడతారని వెల్లడించారు. ఆంధ్రా యువ సంకల్ప్ 2k25 డిజిటల్ మారథాన్ ద్వారా యువత ఆలోచనలు, కలలు, క్రియేటివిటీ ప్రపంచానికి తెలిపేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
Also Read : Popular Ganesh Chaturthi Special Trains : గణేష్ చతుర్థికి 380 పైగా ప్రత్యేక రైళ్లు
