Hydraa AV Ranganath Clear Instructions : ప్ర‌భుత్వ స్థ‌లాలను కాపాడు కోవాల్సింది ప్ర‌జ‌లే

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

Hello Telugu - Hydraa AV Ranganath Clear Instructions

Hello Telugu - Hydraa AV Ranganath Clear Instructions

AV Ranganath : హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ స్థ‌లాలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు, క‌బ్జాల‌కు గురి కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (AV Ranganath). హైడ్రా అంటే ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లుగుతోంద‌న్నారు. విద్యార్థులు సైతం హైడ్రా గురించి ఆలోచిస్తున్నార‌ని అన్నారు. నాలాల‌ను కూడా ప‌రిర‌క్షించే ప‌నిని చేప‌ట్టామ‌ని చెప్పారు. ప్యాట్నీ నాలా విస్త‌ర‌ణ‌తో 7 కాల‌నీలకు వ‌ర‌ద ముప్పు త‌ప్పించామ‌న్నారు. నాలాల్లో పెద్ద‌మొత్తంలో పూడిక‌ను తొల‌గించి ఈ ఏడాది వ‌ర‌ద ముప్పును త‌గ్గించామ‌న్నారు. చెరువులు వాటిని అనుసంధానం చేసే నాలాల‌ను కాపాడుకోక పోతే.. న‌గ‌రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతాయ‌ని హెచ్చ‌రించారు. ఈ ఏడాది భారీ వ‌ర్షాలు కురిసినా.. న‌గ‌రంలో వ‌ర‌ద క‌ష్టాలు లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డామ‌ని చెప్పారు.

Hydraa Commissioner AV Ranganath Key Comments

నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్ నివేదిక ప్ర‌కారం న‌గ‌రంలో 61 శాతం చెరువులు మాయం అయ్యాయ‌ని.. ఇప్ప‌టికైనా అప్ర‌మ‌త్తం కాక‌పోతే మిగ‌తా 39 శాతం కూడా క‌నుమ‌రుగ‌య్యే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ముందుచూపుతో హైడ్రాను ఏర్పాటు చేసి.. చెరువులు, నాలాల ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వ భూములు, పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ప‌రిర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రంపై ప్ర‌జ‌ల్లో ఇప్పుడు పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని హైడ్రా క‌మిష‌న ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. హైడ్రా ఏర్పాటు చేసి ఏడాది దాటి 3 నెల‌ల వ్య‌వ‌ధిలో 1000 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడామ‌న్నారు. దీని విలువ దాదాపు రూ. 60 వేల కోట్లు ఉంటుంద‌న్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.

Also Read : Pawan Kalyan Important Comments on Hydraa : హైడ్రా క‌మిష‌న‌ర్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంగ్రాట్స్

Exit mobile version