Pawan Kalyan Important Comments on Hydraa : హైడ్రా క‌మిష‌న‌ర్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంగ్రాట్స్

హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ అన్ని రాష్ట్రాల‌కూ అవ‌స‌రం

Hello Telugu - Pawan Kalyan Important Comments on Hydraa

Hello Telugu - Pawan Kalyan Important Comments on Hydraa

Pawan Kalyan : అమ‌రావ‌తి : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ప్ర‌ముఖ న‌టుడు, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఓ వివాహ వేడుక‌కు విజ‌య‌వాడకు వెళ్లారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ సంద‌ర్బంగా డిప్యూటీ సీఎంను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు త‌న క్యాంపు కార్యాల‌యంలో. వీరిద్ద‌రి మ‌ధ్య చాలా సేపు చ‌ర్చ‌లు జ‌రిగాయి. హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ ఏపీతో పాటు అన్ని రాష్ట్రాల‌కూ అవ‌స‌ర‌మ‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) అభిప్రాయం వ్య‌క్తం చేశారు. పాల‌కుల ముందు చూపు.. నిబ‌ద్ధ‌త గ‌ల అధికారుల ప‌ని తీరు ఏ వ్య‌వ‌స్థ‌కైనా మంచి పేరు తీసుకు వ‌స్తాయ‌న్నారు. దేశంలోనే మొట్ట మొద‌టిగా హైడ్రా రూపంలో స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చింద‌న్నారు.

Deputy CM Pawan Kalyan Praises Hydraa

కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డ‌మే కాకుండా, స‌రైన అధికారిని నియ‌మించ‌డంతో పాటు పూర్తి స్థాయిలో అధికారాలు అప్ప‌గించ‌డం, పూర్తి స్వేచ్ఛ‌తో ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పించ‌డం జ‌రిగితే ఫ‌లితాలు బాగుంటాయ‌ని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తున్న‌ ఏవీ రంగ‌నాథ్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తార‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. తాను ప్ర‌తి రోజూ హైడ్రా గురించి ఏదో ఒక సంద‌ర్బంలో వింటూనే ఉన్నాన‌ని తెలిపారు. ఇలాంటి అధికారుల వ‌ల్ల ప్ర‌భుత్వాల‌కు మంచి పేరు వ‌స్తుంద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

Also Read : Hydraa Saves Huge Land : పార్కు స్థలం క‌బ్జా.. కాపాడిన హైడ్రా

Exit mobile version