Hyderabad She Teams Shocking : దూకుడు పెంచిన షీ టీమ్స్..478 మంది అరెస్ట్

బోనాలు, మొహ‌ర్రం ఉత్స‌వాల‌లో వెకిటి చేష్ట‌లు

Hello Telugu - Hyderabad She Teams Shocking

Hello Telugu - Hyderabad She Teams Shocking

Hyderabad : హైద‌రాబాద్ – హైద్రాబాద్ లో షీ టీమ్స్ దూకుడు పెంచింది. మ‌హిళా సెక్యూరిటీ (She Teams) విభాగం డిప్యూటీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ లావ‌ణ్య ఆధ్వ‌ర్యంలో పోకిరీలు, ఆక‌తాయిలు, వేధింపుల‌కు పాల్ప‌డుతున్న వారి భ‌ర‌తం ప‌డుతున్నారు. సీసీ కెమెరాలు, ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించ‌డం, వారిపై కేసులు న‌మోదు చేయ‌డం, అదుపులోకి తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. న‌గ‌ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనాలు, మొహ‌ర్రం పండుగ‌లు చోటు చేసుకున్నాయి. ఈ సంద‌ర్బంగా ఉత్స‌వాల స‌మ‌యంలో వేధింపుల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు చేప‌ట్టింది షీ టీమ్స్. వీరిలో 478 మంది నేర‌స్థులు ప‌ట్టుబ‌డిన‌ట్లు వెల్ల‌డించారు డీసీ డాక్ట‌ర్ లావ‌ణ్య‌.

Hyderabad She Teams

ప్ర‌ధానంగా న‌గ‌ర వ్యాప్తంగా షీ టీమ్స్ పెద్ద ఎత్తున ఫోక‌స్ పెట్టాయి. బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశాల‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ను నిర్థారించేందుకు త‌మ కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ సంద‌ర్బంగా ప‌లువురిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నామ‌ని చెప్పారు డాక్ట‌ర్ లావ‌ణ్య‌. ప‌ట్టుబ‌డిన వారిలో 386 మంది పెద్ద‌లు ఉండ‌గా, 92 మంది మైన‌ర్లు ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అదుపులోకి తీసుకున్న వారిలో 288 మందిని హెచ్చ‌రించి విడిచి పెట్టామ‌న్నారు. న‌లుగురిపై పిటీ కేసులు న‌మోదు చేశామ‌న్నారు. రూ. 1,050 జ‌రిమానా విధించామ‌న్నారు. 5 కేసుల్లో దోష‌లుగా నిర్దారించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇందులో ఒక‌రికి జైలు శిక్ష విధించ‌గా, న‌లుగురిలో ఒక్కొక్క‌రికి రూ. 50 చొప్పున ఫైన్ విధించార‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 124 చోట్ల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు డాక్ట‌ర్ లావ‌ణ్య‌. ఏవీ వాహ‌నాల ద్వారా 352 అవ‌గాహ‌న శిబిరాలు నిర్వ‌హించామ‌న్నారు.

Also Read : Katari Eshwar Kumar Warning : పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ ‘కొడాలి’కి ‘క‌టారి’ స‌పోర్ట్

Exit mobile version