Katari Eshwar Kumar : విజయవాడ – గుడివాడలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నానితో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అంశాలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు. జడ్పీ చైర్మన్, బీసీ మహిళ ఉప్పాల హారికాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కటారి ఈశ్వర్ కుమార్ (Katari Eshwar Kumar). బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఎవరు దాడులకు పాల్పడినా చూస్తూ ఊరుకోమని , అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు.
Katari Eshwar Kumar Warning to CM Chandrababu
బెజవాడతో పాటు కృష్ణా జిల్లాలో చక్రం తిప్పారు కొడాలి నాని. పవర్ కోల్పోయాక తను తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడడంతో పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. ఇదే నియోజకవర్గంలో అత్యంత పవర్ ఫుల్ నాయకుడిగా గుర్తింపు పొందిన , మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ మద్దతు లభించడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ లో కలకలం రేపింది. ఓ వైపు కొడాలి మరో వైపు కటారి ఇద్దరూ రాజకీయాలలో తలపండిన నేతలుగా పేరొందారు.
తాను కొడాలి నానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నానని కటారి ఈశ్వర్ కుమార్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు . ఆ తర్వాత మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. కొడాలి నాని ఎంట్రీతో మౌనంగా ఉన్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి తెరపైకి వచ్చారు కటారి. జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై దాడికి పాల్పడడంతో కన్నెర్ర చేశారు. బీసీలకు చెందిన ఆమెపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటే మంచిదన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు కటారి ఈశ్వర్ కుమార్. కొడాలి నానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : MLA Gadari Kishore Shocking Comments : కేసీఆర్ ను కాదు రేవంత్ ను ఉరి తీయాలి
