Hyderabad AI fraud scandal : భాగ్యనగరంలో ఏఐ టెక్నాలజీ పేరుతొ 850 కోట్ల భారీ మోసం

వేణుగోపాల్, వెంకట్రావు, శ్రేయాస్ పాల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు...

Hello Telugu - Hyderabad AI fraud scandal

Hello Telugu - Hyderabad AI fraud scandal

Hyderabad : సైబరాబాద్ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా ఎదురుదెరిగిన పోంజీ స్కీమ్ మోసం కేసులో ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించిన ముగ్గురు ప్రధాన నిందితులు—వేణుగోపాల్, వెంకట్రావు, శ్రేయాస్ పాల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad – నకిలీ కంపెనీలు, ఫేక్ వెబ్‌సైట్లతో మోసం

మాదాపూర్‌లో పలు నకిలీ కంపెనీలు, ఫేక్ వెబ్‌సైట్లు ఏర్పాటు చేసిన నిందితులు, అమాయక ప్రజలను నెలకు 7 శాతం, సంవత్సరానికి 84 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి ఆకట్టుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో వాస్తవానికి ఎలాంటి లావాదేవీలు లేకపోయినా, అది నిజమైన పెట్టుబడిగా చిత్రీకరించి, మొత్తం 3,164 మందిని మోసం చేసి రూ. 850 కోట్లు వసూలు చేశారు.

మనీలాండరింగ్, మ్యూల్ ఖాతాలు, విదేశీ లావాదేవీలు

నిందితులు వసూలు చేసిన డబ్బును 21 మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని దుబాయ్‌లో మనీలాండరింగ్ చేసారని EOW దర్యాప్తులో వెల్లడైంది. ఇంతటి భారీ మోసాన్ని పుప్పాలగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ద్వారా పోలీసులు గుర్తించారు. అతను రూ. 23 లక్షలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Hyderabad – ప్రధాన నిందితుల వివరాలు

Hyderabad – టెక్నాలజీ ఉపయోగించి మోసానికి తెరలేపిన నిందితులు

ఏపీ, తెలంగాణలో AI టెక్నాలజీ ఆధారంగా స్టాక్ మార్కెట్ పై సెమినార్లు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్ మేళవించి ఫేక్ ట్రేడింగ్, నకిలీ లాభాల వలన ప్రజలను నమ్మించగలిగారు. నకిలీ వెబ్‌సైట్లు, అప్లికేషన్లు, ఫేక్ రిపోర్టులు ద్వారా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు.

విలువైన ఆస్తుల స్వాధీనం

సైబరాబాద్ పోలీసులు నిందితుల వద్ద నుంచి:

ఈ కేసులో 20 మందికి పైగా ఏజెంట్లు ప్రధాన నగరాల్లో వ్యవహరించినట్లు గుర్తించగా, వారి పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే, నిందితుల ఆస్తులపై కూడా పూర్తి వివరాలు సేకరించి జప్తు చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Also Read : EPFO Important Decision : పీఎఫ్ ఖాతాదారులకు ఇకపై ఆ డబ్బులు డబుల్

Exit mobile version