EPFO : ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా, పీఎఫ్ సభ్యుడు మరణించిన తర్వాత అతని కుటుంబానికి చెల్లించే డెత్ రిలీఫ్ ఫండ్ (ఎక్స్‌గ్రేషియా) మొత్తాన్ని రూ. 8.8 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచింది. ఈ సవరణ ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది.
EPFO – ఆర్థిక సహాయానికి కొత్త మలుపు
ఈ నిర్ణయంతో, పీఎఫ్ సభ్యులు మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు భారీగా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చెల్లిస్తున్న రూ. 8.8 లక్షల బదులుగా, ఇకపై రూ. 15 లక్షలు అందే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంగీకరించింది.
వార్షికంగా 5% పెరుగుదల
ఇక, మరో కీలక ప్రకటనగా ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ ఎక్స్‌గ్రేషియా మొత్తంలో ప్రతి సంవత్సరం 5 శాతం పెరుగుదల అమలులోకి రానుంది. దీని ద్వారా సంవత్సరానికొకసారి డెత్ రిలీఫ్ ఫండ్ మొత్తంలో స్వల్పంగా అయినా పెరుగుదల జరగనుండగా, ఇది కుటుంబాల ఆర్థిక భద్రతను మరింతగా బలపరిచేలా ఉంటుంది.
క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం
ఈపీఎఫ్‌వో మరో కీలక మార్పును కూడా చేసింది. పీఎఫ్ ఖాతాదారు మరణించిన తర్వాత, మొత్తం మైనర్ పిల్లలకు చెందవలసిన సందర్భాల్లో, ఇంతకుముందు గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది. దీని వల్ల క్లెయిమ్ ప్రక్రియలో ఆలస్యం సంభవించేది. కానీ, తాజా మార్పుతో ఈ నిబంధనను తొలగించడం వల్ల, మినర్లకు సంబంధించిన క్లెయిమ్‌లకు వేగంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
పీఎఫ్ ఖాతాదారులకు భరోసా
ఈ నిర్ణయాల ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, భవిష్యత్తు ఆందోళనలను తగ్గించడంలో EPFO ముందడుగు వేసింది. మరణం వంటి విషాద పరిస్థితుల్లో కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఈ విధానాలు రూపొందించబడ్డాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read : India Shocking Nepal : లిపులేఖ్ పాస్ వివాదంపై కేంద్ర కీలక వ్యాఖ్యలు
