Russia : డిస్కౌంట్ ధరలకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ద్వారా భారత్‌కు లభిస్తున్న వార్షిక లాభం అంచనాల కంటే తక్కువగా ఉందని బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ (CLSA) తెలిపింది. గురువారం విడుదల చేసిన తన అధ్యయన నివేదికలో, ఈ లాభం కేవలం 250 కోట్ల డాలర్లు (సుమారు రూ.21,875 కోట్లు) మాత్రమేనని, ఇది దేశ జీడీపీలో కేవలం 0.6%కే సమానమని స్పష్టం చేసింది.
Russia – అంచనాల కంటే తక్కువ లాభం
గతంలో పలు మీడియా కథనాలు భారత్‌కు రష్యా (Russia) చమురు దిగుమతుల వల్ల 1,000 నుంచి 2,500 కోట్ల డాలర్ల వరకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నాయి. CLSA తాజా నివేదిక ప్రకారం, ఈ అంచనాలు వాస్తవ లాభాల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ప్రపంచంలో మూడో అతిపెద్ద దిగుమతిదారు భారత్
భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా, వినియోగదారుగా నిలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారత్ దిగుమతులలో రష్యా వాటా కేవలం 1% మాత్రమే ఉండగా, యుద్ధం తర్వాత అది 40% దాకా పెరిగింది.
ప్రస్తుతం చమురు దిగుమతి పరిస్థితి (2024-25 ఆర్థిక సంవత్సరం)
- భారత్ మొత్తం దిగుమతులు: రోజుకు 54 లక్షల బారెల్లు
- రష్యా వాటా: 18 లక్షల బారెల్లు (36%)
- ఇరాక్: 20%
- సౌదీ అరేబియా: 14%
- యూఏఈ: 9%
- అమెరికా: 4%
ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి
రష్యా నుంచి దిగుమతులు తగ్గితే లేదా నిలిచిపోతే, భారత్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిమిత ప్రత్యామ్నాయ దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని CLSA హెచ్చరించింది.
Also Read : Indian Stock Market Shocking : ట్రంప్ సుంకాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్ మార్కెట్
