Indian Stock Market Shocking : ట్రంప్ సుంకాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్ మార్కెట్

గురువారం మార్కెట్‌లో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి...

Hello Telugu - Indian Stock Market Shocking

Hello Telugu - Indian Stock Market Shocking

Stock Market : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన అదనపు సుంకాలు భారతీయ మార్కెట్లపై గణనీయ ప్రభావం చూపుతున్నాయి. భారత ఎగుమతులపై సుంకాలను 25% పెంచి 50%కు చేర్చిన చర్య బుధవారం నుంచి అమల్లోకి రావడంతో, గురువారం మార్కెట్‌లో (Stock Market) భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.

Stock Market – సూచీల పతనం

బీఎ్‌సఈ సెన్సెక్స్‌ గురువారం 705.97 పాయింట్లు పడిపోయి 80,080.57 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 211.15 పాయింట్లు కోల్పోయి 24,500.90 స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్‌లో లిస్ట్ అయిన 30 కంపెనీలలో 23 నష్టపోయాయి.

వినాయక చవితి సందర్భంగా బుధవారం మార్కెట్‌ మూసివేయబడింది. అయితే, రెండు రోజుల (మంగళవారం, గురువారం) ట్రేడింగ్‌ సెషన్లలోనే సెన్సెక్స్‌ 1,555.34 పాయింట్లు, నిఫ్టీ 466.85 పాయింట్లు పడిపోయాయి. ఈ క్రమంలో బీఎ్‌సఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9.69 లక్షల కోట్లు క్షీణించి రూ.445.17 లక్షల కోట్లకు చేరుకుంది.

అత్యధికంగా దెబ్బతిన్న రంగాలు

ట్రంప్‌ సుంకాల ప్రభావంతో ఎగుమతి ఆధారిత రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌, రొయ్యలు, తోలు-పాదరక్షలు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగాలు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

టెక్స్‌టైల్స్‌ కంపెనీలు

రొయ్యల రంగం

జెమ్స్‌ & జువెలరీ

Also Read : RC Bhargava Shocking Comments : ట్రంప్ బెదిరింపులకు భారత్ తలవంచొద్దు

Exit mobile version