హోం మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే రాజీనామా చేయాలి

డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామి

hellotelugu-HDkumaraSwamy

బెంగ‌ళూరు : కేంద్ర మంత్రి కుమార స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆర్డీపీఆర్ నియామ‌కాల‌లో చోటు చేసుకున్న అక్ర‌మాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే తక్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇవాళ బెంగ‌ళూరులో కుమార స్వామి మీడియాతో మాట్లాడారు. ఆ లంచం ఎవరికి చేరిందో ప్రియాంక్ ఖర్గే రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. ఏఈఈల నియామకంలో అక్రమాలు జరిగాయని, అందులో ప్రియాంక్ ఖర్గే ప్రమేయం ఉందని నిర్ధారణ అయింది అని అన్నారు. గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నియామకంలో జరిగిన అక్రమాలలో హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే పాత్ర ఉందని ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆర్డీపీఆర్ మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే డి.కె. శివకుమార్ మంత్రివర్గంలో హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఏఈఈల‌ నియామకంలో అక్రమాలు జరిగాయని, అందులో ప్రియాంక్ ఖర్గే ప్రమేయం ఉందని నిర్ధారణ అయిందన్నారు కుమార స్వామి. అక్రమాలు జరిగినట్లు తేలినప్పటికీ ప్రియాంక్ ఖర్గే ఆ నియామక ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేశారని ఆరోపించారు. ఫోరెన్సిక్ పరీక్షలో ఓఎంఆర్ షీట్లను తారుమారు చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ వెంట‌నే తప్పు కోవాల‌న్నారు. ఓఎంఆర్ షీట్లు , ఇతర రికార్డుల అంశాన్ని ఉప-సంఘం పరిశీలించినప్పుడు మొత్తం 24 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింద‌న్నారు కుమార స్వామి . నోటీసులు అందుకున్న వారిలో 20 మంది అభ్యర్థులు ఉప-సంఘం ముందు హాజరు కాగా నలుగురు హాజరు కాలేదని కుమారస్వామి చెప్పారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తాను కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాన‌ని అన్నారు కేంద్ర మంత్రి.

 

Exit mobile version