Home Minister Anitha Important Updates : బాధిత విద్యార్థినుల‌కు హోం మంత్రి భ‌రోసా

కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారికి ప‌రామ‌ర్శ‌

Hello Telugu - Home Minister Anitha Important Updates

Hello Telugu - Home Minister Anitha Important Updates

Home Minister Anitha : విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Home Minister Anitha) అనారోగ్య‌ సమస్యలతో బాధపడుతూ విశాఖ న‌గ‌రంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను సోమ‌వారం ప‌రామర్శించారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని భ‌రోసా ఇచ్చారు. అనంతరం డాక్టర్లతో సమావేశమై, విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా క‌లుషిత నీరు తాగి ఇప్ప‌టికే ఇద్ద‌రు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

Home Minister Anitha Key Comments

మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైఎస్ ష‌ర్మిలా రెడ్డిలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు పేద‌ల‌కు , విద్యార్థుల‌కు వైద్య సేవ‌లు అంద‌కుండా పోతున్నాయ‌ని వాపోయారు. కార్పొరేట్ జ‌పం చేస్తున్న చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌పై స‌రిగా ఫోక‌స్ పెట్టడం లేద‌న్నారు. ఈ సంద‌ర్బంగా బాధిత కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. మ‌రో వైపు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి దీనికి బాధ్య‌త వహించాల‌ని, ఒక్కో కుటుంబానికి రూ. 50 ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా అందించాల‌ని కోరారు. ఈ మొత్తం ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ జ‌రిపించాల‌న్నారు.

Also Read : Minister Kandula Durgesh – AP Growth : విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాం

Exit mobile version