Home Minister Anitha Huge Support : బాధిత కుటుంబాల‌కు హోం మంత్రి భ‌రోసా

ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది

Hello Telugu - Home Minister Anitha Huge Support

Hello Telugu - Home Minister Anitha Huge Support

Home Minister Anitha : నెల్లూరు జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి (Home Minister Anitha) నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనలో గాయపడిన మృతుడు లక్ష్మీనాయుడు సోదరులు పవన్, భార్గవ్ లను గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో పరామర్శించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే బిలిశెట్టి శ్రీ‌ను , టీడీపీ చీఫ్ ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. వారికి అందుతున్న వైద్యసేవలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల చొప్పున చెక్కులు అంద చేశారు. బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్ప‌ష్టం చేశారు వంగ‌ల‌పూడి అనిత‌.

AP Home Minister Anitha Supports

బాధిత కుటుంబం ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద వ‌ద్ద‌ని కోరారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వైద్యం కోసం ఎంత ఖ‌ర్చు అయినా స‌రే స‌ర్కారే భ‌రిస్తుంద‌ని చెప్పారు. ప‌రామ‌ర్శించిన అనంత‌రం వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఎవ‌రు విఘాతం క‌లిగించినా ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. హ‌త్య ఘ‌ట‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుని తీరుతామ‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

Also Read : CM Revanth Reddy Interesting Update : రైతులు రాజులు కావాలి : రేవంత్ రెడ్డి

Exit mobile version