CM Revanth Reddy Interesting Update : రైతులు రాజులు కావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పండుగ శుభాకాంక్ష‌లు

Hello Telugu - CM Revanth Reddy Interesting Update

Hello Telugu - CM Revanth Reddy Interesting Update

CM Revanth Reddy : హైద‌రాబాద్ : దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ దీపావ‌ళి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న ప్ర‌త్యేకంగా రైతుల గురించి ప్రస్తావించారు. రైతులకు అండగా ఉంటూ వారికి సంబంధించిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన గురుతరమైన బాధ్యత లైసెన్స్ పొందిన సర్వేయర్లపై ఉందని అన్నారు. లైసెన్స్ పొందిన సర్వేయర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలవాలి. రైతు రాజు కావాలంటే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. రైతుకు అన్యాయం చేస్తే మన కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినట్టేన‌ని అన్నారు సీఎం.

CM Revanth Reddy Key Comments on Farmers

మీరంతా కష్టపడితే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరొస్తుంద‌ని అన్నారు. ఆ గురుతరమైన బాధ్యత మీ భుజస్కందాలపై పెట్టి గ్రామాలకు, తండాలకు పంపిస్తున్నామ‌ని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన 1 కోటి 60 లక్షల ఎకరాల భూములు యజమానుల వద్ద ఉందన్నారు. 140 సంవత్సరాలుగా వివిధ చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేద‌న్నారు. సరిహద్దుల విషయంలో ఏ రైతు కూడా పరిష్కారం కాకుండా ఇబ్బంది పడొద్దని మిమ్మల్ని నియమించడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు కన్న తల్లిపై ఎంత మమకారం చూపిస్తారో గ్రామంలో తమ భూమి మీద అదే మమకారం చూపిస్తారని చెప్పారు. భూ యజమానుల సరిహద్దులను పరిరక్షించే బాధ్యత మీపై పెట్టామ‌న్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.

Also Read : Donald Trump Shocking : ర‌ష్య‌న్ ఆయిల్ కొనుగోలు చేస్తే భారీ సుంకాలు

Exit mobile version