Home Minister Anitha : విజయవాడ : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తం అయ్యింది ఏపీ సర్కార్. ఇదే సమయంలో దుబాయ్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు, డీజీపీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఎం ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర పర్యావరణ, విపత్తుల, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) అత్యవసర సమీక్ష చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Home Minister Anitha Comments
రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉందని హెచ్చరించింది ఇప్పటికే వాతావరణ శాఖ. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి. పట్టణాల్లో డ్రైనిజీలు క్లియర్ చేయాలని, వర్షపు నీరు ఎప్పటికప్పుడు పోయేలా చూడాలని అన్నారు. ఇరిగేషన్ అధికారులు కట్టల వెంబడి ఇసుక బ్యాగ్స్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు. వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడే సూచన ఉన్నందున యంత్రాంగం అలెర్ట్ గా ఉండాలన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు రైతులు పంట పొలాల్లో ఉండవద్దని సూచించారు.
Also Read : Harish Rao Interesting Update : తెలంగాణలోనే దున్నలకు పూజలు
