Hero Rajinikanth Coolie : విడుద‌ల కాకుండానే కూలీ సంచ‌ల‌నం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్ లో బిగ్ హిట్

Hello Telugu - Hero Rajinikanth Coolie

Hello Telugu - Hero Rajinikanth Coolie

Coolie : ఇంత‌కూ కూలీ సినిమాలో ఏముంది..? ఎందుకంత దీనికి ప్ర‌త్యేక‌త‌..? ఇందులో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఏం చెప్పాడు.? ఇవ‌న్నీ ఇప్పుడు త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో టాప్ హీరో గా కొన‌సాగుతున్న న‌టుడు ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రంపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ చిత్రం విచిత్రంగా రిలీజ్ కాకుండానే రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా ఓవ‌ర్సీస్ సినిమా హ‌క్కులు రూ. 80 కోట్ల‌కు పైగా అమ్ముడు పోయాయి. ఇది ర‌జ‌నీకాంత్ తో పాటు సినిమాను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన స‌న్ పిక్చ‌ర్స్ ను, ద‌ర్శ‌కుడు లోకేష్ ను, న‌టించిన న‌టుల‌ను విస్తు పోయేలా చేసింది. 70 ఏళ్లకు పైబ‌డిన ఈ సూప‌ర్ స్టార్ త‌న ఇమేజ్ కు ఎలాంటి ఢోకా లేద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. ఈ కూలీ (Coolie) సినిమాలో ఇంకో ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే ఇందులో ఇత‌ర కీ రోల్స్ పోషించిన ఉపేంద్ర , అక్కినేని నాగార్జున‌, షాబీర్, అమీర్ ఖాన్ లంతా 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారే . మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టించింది ఇల‌య నాయ‌గ‌న్ కూతురు , న‌టి శ్రుతీ హాస‌న్.

Rajinikanth Coolie Movie Updates

కూలీ సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ సాంగ్ ఓ మోనికా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇందులో పూజా హెగ్డేతో పాటు మ‌ళ‌యాల న‌టుడు షాబీర్ న‌టించాడు. ఆమె కంటే త‌న న‌ట‌నే పిచ్చెక్కించేలా చేసింది. ఇలాంటి వ‌య‌సు మ‌ళ్లిన వారిని పెట్టుకుని కూలీని ధైర్యంగా తీయ‌డం మామూలు విష‌యం కాదు. చాలా మంది ద‌ర్శ‌కులు యంగ్ హీరోస్ కు ప్ర‌యారిటీ ఇస్తారు. కానీ లోకేష్ త‌న క‌థ మీద న‌మ్మ‌కం ఉండ‌డంతో స‌న్ పిక్చ‌ర్స్ ను ఒప్పించాడు. ఎట్ట‌కేల‌కు కూలీని విడుద‌ల చేసేందుకు రంగం సిద్దం చేశాడు. ఆగ‌స్టు 14న ప్ర‌పంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాల‌లో కూలీ చిత్రం రిలీజ్ కానుంది. ఇది కూడా రికార్డే.

Also Read : Hero Shah Rukh Khan : జాతీయ అవార్డుకు బాద్ షా అర్హుడు

Exit mobile version