Russia Deputy PM Interesting Comments : భార‌త్, ర‌ష్యాల మ‌ధ్య బంధం బ‌లోపేతం

ర‌ష్యా ఉప ప్ర‌ధాన‌మంత్రి పాత్రుషేవ్

Hello Telugu - Russia Deputy PM Interesting Comments

Hello Telugu - Russia Deputy PM Interesting Comments

Russia : ఢిల్లీ : భార‌త్, ర‌ష్యా దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ర‌ష్యా ఉప ప్ర‌ధానమంత్రి పాత్రుషేవ్. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై ఇరువురు నేత‌లు భేటీ అయ్యారు. ఈఇద్ద‌రి స‌మావేశం కీల‌కంగా మారింది. ఓ వైపు భార‌త్ పై భ‌గ్గుమంటున్నారు అమెరికా చీప్ ట్రంప్. ర‌ష్యా (Russia) నుంచి గ‌త కొన్నేళ్లుగా భారత్ ఆయిల్ కొనుగోలు చేసింది. తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న ఈ త‌రుణంలో ర‌ష్యా డిప్యూటీ పీఎం ప్ర‌ధానిని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇరువురు నేత‌లు ప్ర‌ధానంగా వ్యవసాయం, ఎరువులు, ఆహార ప్రాసెసింగ్ , పరస్పర ఆసక్తి ఉన్న ఇతర రంగాలలో సహకారాన్ని పెంపొందించు కోవడంపై అభిప్రాయాలను పంచుకున్నారు.

Russia Deputy PM Key Comments

డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సన్నాహాల్లో భాగంగా ఉప ప్ర‌ధాన‌మంత్రి పత్రుషేవ్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు. ప్ర‌ధాన రంగాల‌తో పాటు ఇత‌ర రంగాలలో సహకారాన్ని భార‌త్, ర‌ష్యా దేశాలు పెంచుకోవడంపై తామిరువురం అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు ఉప ప్ర‌ధాన‌మంత్రి. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ శాఖ మంత్విత్ర శాఖ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి త‌న‌ను భారతదేశానికి స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

Also Read : CM Revanth Reddy New Innovation : ప్ర‌భుత్వ బ‌డుల్లో సీఎం అల్పాహారం ప‌థ‌కం

Exit mobile version