AP : అమరావతి : ఏపీ వాతావరణ కేంద్రం ఎండీ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన చేశారు. మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ముంచెత్తుతాయని హెచ్చరించారు. నిన్నటి నుంచి విశాఖపట్నంతో పాటు విజయనగరం జిల్లాల్లో పెద్ద ఎత్తున కుండ పోత వర్షం కురుస్తోంది. పెట్రోలియం కంపెనీపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. విజయనగరం జిల్లాలో పిడుగులు పడడంతో గొర్రెలు మృతి చెందాయి. తాజాగా ఐఎండీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఏపీలో (AP) మరో నాలుగు రోజుల పాటు ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కార్ కు సూచనలు చేశారు ఎండీ ప్రఖర్ జైన్.
AP Heavy Rains Update
నాలుగు రోజులు అంటే సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆంధ్రాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో ఈదురుగాలులు, మెరుపులు , బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. బంగాళా ఖాతంలో ఎగువ వాయు ప్రసరణ కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర (ఎన్‌సిఎపి), యానాంలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రాయలసీమతో సహా అదే ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది ఐఎండీ. వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బేలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ, 5.8 కి.మీ మధ్య ఎగువ వాయు ప్రసరణ కొనసాగుతోందని, ఇది దక్షిణం వైపునకు వంగి ఉందని ఆ శాఖ తెలిపింది.
Also Read : Minister Ponnam Fired on Modi Govt : కేంద్రం కక్ష తెలంగాణపై వివక్ష : పొన్నం
