APIMD Strong Warning : ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

ప‌లు జిల్లాల‌కు పిడుగుపాటు హెచ్చ‌రిక‌

Hello Telugu - APIMD Strong Warning

Hello Telugu - APIMD Strong Warning

APIMD : అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ సంస్థ (APIMD). ప‌లు జిల్లాల‌కు పిడుగు పాటు హెచ్చ‌రిక జారీ చేసింది. రాగల 3 గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ పేర్కొన్నారు. చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ఆయా ప్రాంతాల‌లో అవ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు. మ‌రో వైపు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరెంజ్ అల‌ర్ట్ చేశారు. పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు.

APIMD Warning

బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని ఇక్క‌డ ఎల్లో అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఎవ‌రూ కూడా చెట్ల కింద‌, శిథిల భ‌వ‌నాల వ‌ద్ద నిల్చోవ‌ద్ద‌ని పేర్కొన్నారు ఎండీ. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని త‌లిపారు. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల మేర‌కు ఏపీ రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ముంద‌స్తుగా అప్ర‌త్త‌మైంది. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.

Also Read : MP Gurumurthy Strong Demand : ఎంపీ గురుమూర్తి ఆవేద‌న కేంద్రం స్పంద‌న

Exit mobile version