MP Gurumurthy : తిరుపతి : అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అలాగే సెర్ప్, మెప్మా పథకాలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్ సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి పనికి తగిన పారితోషికం కల్పించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి (MP Gurumurthy) కేంద్రాన్ని కోరారు . ఫిబవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో జీరో అవర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వీరు తీవ్ర అసమానతలకు గురవుతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
MP Gurumurthy Demand
ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాధవ్ సమాధానం ఇచ్చారు. తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.4,500, అంగన్‌వాడీ సహాయకులకు రూ.2,250 గౌరవ వేతనం చెల్లిస్తున్నట్లు, అదనంగా కార్యకర్తలకు రూ.500, సహాయకులకు రూ.250 ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ వనరుల మేరకు మరింత గౌరవ వేతనం అదనంగా చెల్లించ వచ్చని సూచించారు. సూపర్వైజర్ పోస్టుల్లో 50 శాతం అంగన్‌వాడీ కార్యకర్తలు, 50 శాతం అంగన్‌వాడీ సహాయకులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన కింద రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద భీమా, పాక్షిక వైకల్యం కోసం రూ.1 లక్ష బీమా కవరేజ్ అంద జేయబడుతోందని పేర్కొన్నారు. 60 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ అందించేందుకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో నమోదు చేయాలని రాష్ట్రాలకు సూచించారని చెప్పారు.
అదనంగా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కవరేజ్ విస్తరించబడిందని తెలిపారు. సంవత్సరానికి 20 రోజుల సాధారణ సెలవులు, గర్భస్రావానికి 45 రోజుల సెలవు, 180 రోజుల ప్రసూతి సెలవు, రెండు సెట్ల యూనిఫాంలు కూడా అందజేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read : Minister Parthasarathy Fired on Jagan : బడుగుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
