ఆగ‌స్టు 13న కావేరీ నీటి వివాదంపై విచార‌ణ

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన దావాపై

hellotelugu-SupremeCourt

న్యూఢిల్లీ : క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతోంది కావేరి నీటి వివాదం. ఇందుకు సంబంధించి తాజాగా సీఎం జోసెఫ్ విజ‌య్ సార‌థ్యంలోని నూత‌న టీవీకే ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది కావేరీ నీటి విడుద‌ల‌పై. దాఖ‌లు చేసిన పిటిష‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. ఆగ‌స్టు 13న విచారించనుంది సుప్రీంకోర్టు . తమిళనాడుకు కావేరీ నదీ జలాల విడుదలకు సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఉన్న కృష్ణరాజ సాగర్ జలాశయం నుండి తమ వాటా నీటిని తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తమకు దక్కాల్సిన కావేరీ నీటి వాటాను తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను 13న విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. వర్షాభావ పరిస్థితులు ఉన్న ఈ ఏడాదిలో తమిళనాడుకు కావేరీ నీటిలో దక్కాల్సిన వాటా లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ , వి. మోహనాలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. దీనిని గురువారం విచారణకు జాబితా చేస్తాం అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

Exit mobile version