HDFC Bank : ఢిల్లీ – భారత దేశంలో పేరు పొందిన 10 బ్యాంకులలో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకుకు (HDFC Bank) భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఏకంగా సదరు బ్యాంకు రూ. 47,482 కోట్లను కోల్పోయింది . మార్కెట్ లో చోటు చేసుకున్న ఇబ్బందుల కారణంగా తలెత్తింది. ప్రస్తుతం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు మొత్తం రూ.14,60,863.90 కోట్లకు చేరుకుంది . మొత్తం మార్కెట్ సెంటిమెంట్ బేరిష్‌గా మారడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తీవ్ర క్షీణతను ఎదుర్కొంది.
HDFC Bank Loose
మొత్తం మీద, BSEలో టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలలో ఎనిమిది కంపెనీలు ఈ వారంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.2,24,630.45 కోట్లు నష్టపోయాయి, ఆ వారంలో బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,497.2 పాయింట్లు ఉండగా 1.84 శాతం పడి పోయింది. ఇక హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకే కాకుండా ఇతర ప్రధాన బ్యాంకుగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు కూడా నష్టాలను చవి చూసింది. ఇది రూ. 27,135.23 కోట్లు తగ్గి రూ. 9,98,290.96 కోట్లకు చేరుకుంది మరో వైపు ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ రూ. 24,946.71 కోట్లు తగ్గి రూ. 10,77,213.23 కోట్ల వద్ద ఆగి పోయింది.
ఇక భారతీయ జీవిత భీమా సంస్థ మార్కెట్ వాల్యూ రూ. 23,655.49 కోట్లు తగ్గింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 12,692.1 కోట్లు కోల్పోయింది.బజాజ్ ఫైనాన్స్ , ఇన్ఫోసిస్ కూడా వరుసగా రూ. 10,471.08 కోట్లు , రూ. 7,540.18 కోట్ల నష్టాలతో క్షీణించాయి. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్ యూనిలీవర్ ఈ ట్రెండ్‌ను అధిగమించాయి. టాటా దాని మార్కెట్ విలువకు రూ. 11,125.62 కోట్లు జోడించగా, హెచ్ యుఎల్ రూ. 7,318.98 కోట్లు లాభపడింది.
Also Read : Jajula Srinivas Goud Interesting : 50 శాతం సీలింగ్ ను ఎత్తి వేయడం భేష్
