Jajula Srinivas Goud Interesting : 50 శాతం సీలింగ్ ను ఎత్తి వేయ‌డం భేష్

బీసీ సంఘం నేత జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

Hello Telugu - Jajula Srinivas Goud Interesting

Hello Telugu - Jajula Srinivas Goud Interesting

Jajula Srinivas Goud : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు బిల్లు చట్టం చేసిన సందర్భంగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం వ‌ద్ద అమ‌రుల‌కు నివాళులు అర్పించారు జాతీయ బీసీ సంఘం అధ్య‌క్షుడు జ‌జుల శ్రీ‌నివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). ఈ సందర్భంగా ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం సీలింగును ఎత్తివేస్తూ అసెంబ్లీలో పంచాయతీ చట్ట సవరణ బిల్లును ఆమోదించడం అభినందనీయం అన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడాన్ని ఆహ్వానిస్తున్నామ‌న్నారు.

Jajula Srinivas Goud Key Comments

బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ వాకటి శ్రీహరి, ఆది శ్రీనివాసలకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నామ‌న్నారు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). చట్టం చేయడానికి అసెంబ్లీలో చర్చలో పాల్గొని మద్దతు తెలియజేసిన టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, ఎంఐఎం పార్టీలకు కృతజ్ఞతలు తెలియ చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం సహకరించి ఉంటే బీసీ లకు ఎప్పుడో న్యాయం జరిగేదన్నారు.

అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టానికి రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తారని విశ్వసిస్తున్నాం అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి యావత్ తెలంగాణ సమాజం సహకరించాల‌ని కోరారు. బీసీ రిజర్వేషన్లపై దయచేసి ఎవరు కోర్టుకు వెళ్లొద్దని కోరారు, న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని బీసీల నోటికాడ ముద్దను గుంజు కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అలా చేస్తే వారిని బీసీల ద్రోహులుగా ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ యూనిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్లు, పూలే ఆశయ సాధన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వకాధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్, జగదీశ్వర్ చారి తదితరులు ఉన్నారు.

Also Read : XI Jinping Interesting Comments : భార‌త దేశంతో బంధం బలోపేతం : జిన్ పింగ్

Exit mobile version