Harish Rao : హైదరాబాద్ : రాష్ట్రంలో వడ్డెర సోదరులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao). తెలంగాణ భవన్‌లో వడ్డెర సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అందరిలాగా మేము కూడా పైకి రావాలి. మేలు జరగాలని మీరు కోరుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం వడ్డెర సమాజానికి సహాయం చేసిందని, సిద్దిపేటలో ట్రాక్టర్లు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే వడ్డెర సోదరులపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao Slams Congress Govt
కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో బిల్డింగులు నిర్మించే వాళ్లకకు చేతినిండా పని దొరికేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో సామాన్యులు, పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. దీంతో వారంతా రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా బయట పల్లకిల మోతా లాగా మారి పోయిందన్నారు.పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఎద్దేవా చేశారు హరీశ్ రావు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా అని ప్రశ్నించారు.
Also Read : CP Sajjanar Shocking Comments : తాగుబోతులు టెర్రరిస్టులు ఒక్కటే : సజ్జనార్
