CP Sajjanar : హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న కావేరి వోల్వో బస్సు దగ్ధం ఘటనపై స్పందించారు. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం అయ్యారు. 21 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ఇది జరగాడానికి ప్రధాన కారణం తాగుబోతుల వల్లనే జరిగిందని తేల్చారు పోలీసులు. ఈ విషయం తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సజ్జనార్ (CP Sajjanar). ఆయన సామాజిక వేదిక ఎక్స్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ప్రయాణీకులు గాల్లో కలిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు సీపీ.
CP Sajjanar Shocking Comments
ఈ సందర్భంగా మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టన బెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులతో పోల్చారు. వీరు మానవ బాంబులు కాక ఇంకేమవుతారు అంటూ ప్రశ్నించారు సజ్జనార్. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. మీ సరదా, జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండాలని కోరారు. వీరి కదలికలపై వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారంటూ మండిపడ్డారు.
Also Read : Minister Savitha Important Update : స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెరలకు ప్రాధాన్యం
