AP Rains : అమరావతి : రాష్ట్ర వాతావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఏపీ రాష్ట్రంలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కోరారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వర్షాల (AP Rains) ప్రభావం కారణంగా ఈనెల 20వ తేదీన సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాతో పాటు బాపట్ల, చిలువూరు, ప్రకాశం, శ్రీ పొట్టి తిరుపతూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరెడ్డి జిల్లాల్లో వర్షాలు వస్తాయని తెలిపారు.
AP Rains Update
మరో వైపు ఈనెల 21న మంగళవారం రోజు పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు వస్తాయని వెల్లడించారు ప్రఖర్ జైన్. 22న బుధవారం బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, 23న గురువారం రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, బాపట్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో బంగాళా ఖాతంలోని దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు.
Also Read : Hero Dulquer-Bhagyashri Kaantha Movie : 14న దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ కాంతా రిలీజ్
