Harish Rao Strong Demand : కాళోజీ యూనివ‌ర్శిటీ బాగోతంపై చ‌ర్య‌లు తీసుకోవాలి

కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Strong Demand

Hello Telugu - Harish Rao Strong Demand

Harish Rao : హైద‌రాబాద్ : కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao). ఈ సంద‌ర్బంగా ఆయ‌న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారింద‌ని ఆరోపించారు. ఇటీవలి కాలంలో ఈ విశ్వ విద్యాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరం అన్నారు.

Harish Rao Demand

చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంతు రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనం అంటూ మండిప‌డ్డారు. వైద్య విద్య మార్కుల రీ-వాల్యుయేషన్ ప్రక్రియపై కొద్ది రోజులుగా వరుసగా తీవ్రమైన ఆరోపణలు వెల్లు వెత్తుతున్నా స‌ర్కార్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు. పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు, కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారని ప్ర‌శ్నించారు. ఈ అక్రమాల వెనుక విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. నందకుమార్ రెడ్డి సూత్రధారి అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిల‌దీశారు.

Also Read : Nara Lokesh Clear Update : గ్రంథాల‌యాలు విజ్ఞానానికి ద్వారాలు

Exit mobile version