Nara Lokesh Clear Update : గ్రంథాల‌యాలు విజ్ఞానానికి ద్వారాలు

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

Hello Telugu - Nara Lokesh Clear Update

Hello Telugu - Nara Lokesh Clear Update

Nara Lokesh : అమ‌రావ‌తి : విజ్ఞాన భాండాగారాలు గ్రంథాల‌యాలు అని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేసేందుకు స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద రూ.1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని నారా లోకేష్ ప్రారంభించారు. 1986లో సీఎం హోదాలో దివంగ‌త ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు లోకేష్. ఇవాళ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చొరవతో లైబ్రరీని ఆధునీకరించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు.

IT Minister Nara Lokesh Key Comments

మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు సెంటర్లో ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాలను ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా నారా లోకేష్ ప్ర‌సంగించారు. ఆనాటి స్వాతంత్ర ఉద్య‌మానికి లైబ్రరీలు కీల‌క‌మైన పాత్ర‌ను పోషించాయ‌ని చెప్పారు. గ్రంథాల‌యాలు లేని ఊరును తాను ఊహించ లేన‌ని అన్నారు. త‌మ స‌ర్కార్ ఎక్కువ‌గా విద్యా రంగం బ‌లోపేతంపై దృష్టి సారిస్తుంద‌ని చెప్పారు. విద్యార్థులు, యువ‌తీ యువ‌కులు, పెద్ద‌ల‌కు మార్గ‌ద‌ర్శిగా లైబ్రరీ ఉప‌యోగ ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

Also Read : Kavitha Strong Demand : విద్యా రంగంపై స‌ర్కార్ దృష్టి సారించాలి

Exit mobile version