Harish Rao Fired on CM Revanth : మెడిక‌ల్ సీట్ల‌లో తెలంగాణ విద్యార్థుల‌కు అన్యాయం

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Harish Rao : హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్లు లేక పోవ‌డం, అమ‌లు కాక పోవ‌డం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన అన్యాయంపై స్పందించారు. తక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో రాష్ట్ర‌ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించక పోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Harish Rao Slams

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు ఉన్నాయని తెలిపారు వీటిలో 50 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళ్తాయ‌ని పేర్కొన్నారు. మిగిలిన 50 శాతం రాష్ట్ర కోటాలో ఉండే సీట్లలో 25 శాతం (సుమారు 450 సీట్లు) మేనేజ్మెంట్ కోటాగా ఉంటాయని వెల్ల‌డించారు హ‌రీశ్ రావు. అయితే ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయక పోవడంతో మొత్తం సీట్లు ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్ళి పోతున్నాయని పేర్కొన్నారు. సీఎం నిర్ల‌క్ష్యం కార‌ణంగానే విద్యార్థుల‌కు శాపంగా మారింద‌న్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్ కల్పించింద‌న్నారు.

Also Read : YS Jagan Fired on CM Chandrababu : ఏపీలో జోరుగా క‌ల్తీ మ‌ద్యం వ్యాపారం : జ‌గ‌న్ రెడ్డి

Exit mobile version