YS Jagan Fired on CM Chandrababu : ఏపీలో జోరుగా క‌ల్తీ మ‌ద్యం వ్యాపారం : జ‌గ‌న్ రెడ్డి

మ‌ద్యానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిన చంద్ర‌బాబు

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

YS Jagan : అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు జ‌గ‌న్ రెడ్డి (YS Jagan). రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్‌ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నార‌ని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంద‌న్నారు.

YS Jagan Slams CM Chandrababu

మీ లిక్కర్‌ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకూ విస్తరించిన బెల్టు షాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని ఫైర్ అయ్యారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారు చేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారని నిప్పులు చెరిగారు జ‌గ‌న్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

Also Read : Sanju Samson – BCCI Sensational : సంజూ శాంస‌న్ పై బీసీసీఐ ఎందుకంత క‌క్ష‌..?

Exit mobile version