Harish Rao Fired on CM Revanth : ఆటో డ్రైవ‌ర్ల‌కు ఇచ్చిన హామీల సంగతేంటి..?

న‌టుల కంటే ఎక్కువ న‌టిస్తున్న రాహుల్, రేవంత్

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Harish Rao : హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై భ‌గ్గుమ‌న్నారు. సోమ‌వారం ఆయ‌న ఆటో డ్రైవ‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా ఆటోలో వ‌చ్చారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంద‌న్నారు. ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు . రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌కు వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ యాక్టింగ్ చేశాడని ఆరోపించారు. ఆరోజు ఇదే యూసుఫ్‌గూడాలో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని మండిప‌డ్డారు. ఇప్పుడు కూడా స‌ప్పుడు చేయ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 12000 ఇస్తామని మోసం చేసిందన్నారు. వెంటనే బాకీ పడ్డ 24 వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హ‌రీశ్ రావు.

MLA Harish Rao Slams CM Revanth Reddy, Rahul Gandhi

మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా రూ. 1500 కోట్లు అవుతుందన్నారు. రూ. 3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై రూ. 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయన్నారు. అందులో నుంచి రూ. 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని డిమాండ్ చేశామ‌న్నారు. ఇప్పటి వరకు 161 ఆటో కార్మికులు చని పోయార‌ని, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

Also Read : Prabhakar Bhatt Shocking : ఆర్ఎస్ఎస్ నేత ప్ర‌భాక‌ర్ భ‌ట్ కు స‌మ‌న్లు

Exit mobile version