ముంబై : వరుణ్ ధావన్ నటించిన చిత్రం హై జవానీ తో ఇష్క్ హోనా హై విడుదలై జనాదరణ పొందుతోంది. ధావన్ తో పాటు అందాల తారలు మృణాల్ ఠాకూర్ , పూజా హెగ్డే కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే మెరుగైన స్పందనను రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం భారతదేశంలో మొదటి రోజున రూ. 8.65 కోట్ల నికర వసూళ్లను సాధించింది. 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ వల్ల సినిమాకు గణనీయమైన ప్రయోజనం చేకూరిందని, అలాగే విడుదల ముందు ఉన్న అంచనాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిందని ఆదర్శ్ పేర్కొన్నారు.
కాగా సినిమా విడుదలకు ముందు అంచనాలు మొదటి రోజు వసూళ్లు రూ. 7 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల పరిధిలో ఉంటాయని సూచించాయి కానీ ఈ చిత్రం ఆ అంచనాలను సునాయాసంగా అధిగమించింది అని ఆదర్శ్ రాశారు. ఈ చిత్రంలో ప్రదాన ఆకర్షణగా నిలిచారు వరుణ్ ధావన్‌తో పాటు మృణాల్ ఠాకూర్ , పూజా హెగ్డే . అలాగే చంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, రాకేష్ బేడీ , మనీష్ పాల్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. నటి మౌనీ రాయ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. నిర్మాత రమేష్ తౌరానీ సమర్పణలో వచ్చిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ జూన్ 5న శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్, దర్శకుడు డేవిడ్ ధావన్ కలయికలో వచ్చిన మరో చిత్రం కావడం విశేషం
