Google : ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ అత్యవసర అలర్ట్ జారీ చేసింది. సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఖాతాల భద్రతను పెంపొందించుకోవడానికి పాస్‌వర్డ్‌లు వెంటనే అప్‌డేట్ చేయడం, టూ-స్టెప్ వెరిఫికేషన్ (2SV) తప్పనిసరిగా ఆన్ చేయాలని గూగుల్ (Google) సూచించింది.
Google – హ్యాకర్ల దాడుల వెనుక “షైనీహంటర్స్”
గూగుల్ ప్రకారం, ఈ దాడుల వెనక “షైనీహంటర్స్” అనే అంతర్జాతీయ హ్యాకర్ గ్రూప్ ఉంది. 2020 నుంచి యాక్టివ్‌గా ఉన్న ఈ గ్రూప్, AT&T, మైక్రోసాఫ్ట్, సాంటాండర్, టికెట్‌మాస్టర్ వంటి ప్రముఖ సంస్థల డేటా లీక్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ గ్రూప్ ప్రధానంగా ఫిషింగ్ పద్ధతిని ఉపయోగించి వినియోగదారులను నకిలీ లాగిన్ పేజీలకు మళ్లించి, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ కోడ్‌లు దొంగిలిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
గూగుల్ హెచ్చరికలు
- ఇప్పటికే జూన్‌లోనే గూగుల్ బ్లాగ్‌పోస్ట్ ద్వారా షైనీహంటర్స్ కొత్త డేటా లీక్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది.
- దీని కారణంగా డేటా దోపిడీలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది.
- ఆగస్టు 8న ప్రభావిత వినియోగదారులకు ప్రత్యేక మెయిల్స్ పంపి, భద్రతా సెట్టింగ్స్‌ను తక్షణం అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
టూ-స్టెప్ వెరిఫికేషన్ (2SV) ఎందుకు అవసరం?
- 2SV ద్వారా ఇమెయిల్ అకౌంట్‌కు అదనపు రక్షణ లభిస్తుంది.
- హ్యాకర్లు పాస్వర్డ్ తెలిసినా, సెక్యూరిటీ కోడ్ లేకుండా లాగిన్ అవడం సాధ్యం కాదు.
- ఈ కోడ్ సాధారణంగా మొబైల్ లేదా నమ్మదగిన పరికరానికి వస్తుంది.
యూకేలోని యాక్షన్ ఫ్రాడ్ ప్రకారం, 2SV ఆన్ చేస్తే హ్యాకర్లు మీ ఖాతాలోకి ప్రవేశించలేరని స్పష్టం చేసింది. కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే ఈ చర్య, ఇమెయిల్ భద్రతకు అత్యంత కీలకం.
కేవలం జీమెయిల్‌కే కాదు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది జీమెయిల్‌కే పరిమితం కాకుండా బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా ఖాతాలు వంటి అన్ని ప్రధాన సేవల్లో కూడా టూ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (2FA) లేదా మల్టీ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (MFA) వినియోగించడం అత్యంత అవసరం.
Also Read : Stock Market Growth : నేడు భారీ లాభాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్
