Stock Market : గత వారం వరుస నష్టాలతో భారీగా క్షీణించిన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈ వారాన్ని సానుకూల ధోరణిలో ప్రారంభించాయి. 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుని 80 వేల మార్క్‌ను అధిగమించింది. చైనాతో భారత్ సంబంధాలు మెరుగవుతాయనే అంచనాలు, కనిష్టాల వద్ద మదుపరుల కొనుగోళ్లు సూచీలకు ఊతమిచ్చాయి.
Stock Market – మార్కెట్ తాజా స్థితి
- గత శుక్రవారం 79,809 వద్ద ముగిసిన సెన్సెక్స్, సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైంది.
- ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 391 పాయింట్లు ఎగబాకి 80,201 వద్ద కొనసాగుతోంది.
- నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 24,551 వద్ద ట్రేడవుతోంది.
లాభాలు – నష్టాలు
- లాభాల్లో ఉన్న షేర్లు: బీఎస్ఈ లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, సీజీ పవర్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, కేన్స్ టెక్నాలజీస్.
- నష్టాల్లో ఉన్న షేర్లు: మారుతీ సుజుకీ, ఎస్బీఐ కార్డ్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ లాంబార్డ్, రిలయన్స్.
ఇతర సూచీలు
- నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 749 పాయింట్లు లాభంలో ఉంది.
- బ్యాంక్ నిఫ్టీ 312 పాయింట్లు ఎగసింది.
- రూపాయి, డాలర్‌తో పోలిస్తే 88.23 వద్ద కొనసాగుతోంది.
Also Read : Silver New Innovation : సెప్టెంబర్ 1 నుంచి వెండి పై కొత్త విధానం
