Gold Price Growth : పసిడి పంజా! లక్షా 23 వేల దాటిన బంగారం ధరలు

పసిడి ధరలు సాధారణ ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి...

Hello Telugu - Gold Price Growth

Hello Telugu - Gold Price Growth

Gold : దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు మరోసారి రికార్డులు తిరగరాస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారంలోకి మళ్లీ దూసుకెళ్తున్నారు. ఈ డిమాండ్‌తో పసిడి ధరలు సాధారణ ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి.

Gold – లక్షా 23 వేల దాటిన బంగారం:

బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.1,150 పెరిగి ₹1,23,170కు చేరుకుంది. ఇది ఇప్పటి వరకు నమోదు అయిన అత్యధిక రేట్లలో ఒకటి. 22 క్యారెట్ల బంగారం (Gold) రూ.1,050 పెరిగి ₹1,12,900గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.860 పెరిగి ₹92,380కి చేరింది.

వెండి ధరలు కూడా ఉరకలు:

బంగారం (Gold) ధరల పెరుగుదల వెండి మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. కిలో వెండి ధర ప్రస్తుతం ₹1,57,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేటు ₹1,67,000 వరకు చేరింది. ఈ రేట్లు వెండి కొనుగోలుదారులను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ఉధృతి:

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,23,170గా ఉంది. 22 క్యారెట్ల ధర ₹1,12,900గా కొనసాగుతోంది. కిలో వెండి ధర ₹1,67,000 వద్ద స్థిరంగా ఉంది.
నిపుణులు చెబుతున్నట్లు, ధరలు నగరాన్నిబట్టి స్థానిక డిమాండ్‌, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి.

ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ ప్రభావం:

బంగారం ధరలను ఎగదొక్కుతున్న ప్రధాన కారణాల్లో అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం, ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ భయం, జపాన్‌ బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల ఉన్నాయి. ఇవన్నీ గ్లోబల్ మార్కెట్‌లో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి బలాన్నిస్తున్నాయి.

ముందు రోజుల్లో ఏం జరుగుతుందో?

ప్రస్తుత పరిస్థితి చూస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులకు ఇది లాభదాయకమైన సమయమైతే, సాధారణ కొనుగోలుదారులకు మాత్రం భారమైన బంగారం కాలంగా మారుతోంది.

Also Read : UPI Important Update : యూపీఐలో పొరపాటు చెల్లింపు? వెంటనే ఇలా చేయండి!

Exit mobile version