Gold Price Sensational : రూ. 1,12,000కు చేరుకున్న బంగారం ధ‌ర

సామాన్యుల‌కు అంద‌నత్త ఎత్తులో ప‌సిడి

Hello Telugu - Gold Price Sensational

Hello Telugu - Gold Price Sensational

Gold : హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో బంగారం (Gold) ధ‌ర అమాంతం పెరుగుతూ పోతోంది. నిన్న‌టి మొన్న‌టి దాకా ల‌క్షకు పైగా ఉన్న 10 గ్రాముల ధ‌ర ఉన్న‌ట్టుండి ఇవాళ రూ. 1,12,000కు దాటేసింది. ఇది రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు బులియ‌న్ మార్క‌ట్ లో. 22 క్యారెట్ , 24 క్యారెట్ల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో కొనుగులుదారులు ల‌బోదిబోమంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే ప‌రిస్తితి నెల‌కొంది. ప‌సిడి ధ‌ర‌లు మరోసారి పదునైన పెరుగుదలను నమోదు చేశాయి, ఎందుకంటే పెట్టుబడిదారులు ఇతర ఆస్తి తరగతుల కంటే విలువైన లోహాలను ఇష్టపడతారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, దేశంలో స్థిరమైన పండుగ డిమాండ్‌తో, బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. కమోడిటీ మార్కెట్ నుండి బలమైన ఆసక్తిని ఆకర్షిస్తున్నాయి.

Gold Price Sensational

త్వ‌ర‌లోనే ద‌స‌రా, దీపావ‌ళి పండుగలు రానున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మ‌హిళ‌లు , ఇత‌రులు బంగారాన్ని, వెండిని , ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసేందుకు ఇష్ట ప‌డ‌తారు. ఇదిలా ఉండ‌గా నిన్న ధ‌ర‌ల్లో పెద్దగా మార్పు కనిపించనప్పటికీ శుక్రవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి కీలక నగరాల్లో 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,000 కు చేరుకుంది, ఇది రూ. 700 పెరుగుదలను సూచిస్తుంది. 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు రూ. 1,11,280 కు అమ్ముడవుతోంది. ఇది మునుపటి రోజుతో పోలిస్తే రూ.771 ఎక్కువ.

మ‌రోవైపు ప‌సిడితో పాటు వెండి ధ‌ర కూడా పెరుగుతోంది. అనేక మెట్రోపాలిటన్ మార్కెట్లలో కిలోగ్రాముకు వెండి ధర పెరిగింది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు ద్రవ్యోల్బణ ఆందోళనలు, కరెన్సీ హెచ్చుతగ్గులు , భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తున్నాయి.

Also Read : VP CP Radhakrishnan Success : ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం

Exit mobile version