Gautam Adani New Innovation : లక్షల కోట్ల పెట్టుబడులతో కొత్త వ్యాపార రంగంలోకి అదానీ సంస్థ

ముఖ్యంగా విమానాశ్రయ రంగంలో వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.95,000 కోట్ల నుంచి రూ.96,000 కోట్ల వరకు పెట్టుబడులు..

Hello Telugu - Gautam Adani New Innovation

Hello Telugu - Gautam Adani New Innovation

Gautam Adani : అపర కుబేరుడిగా పేరుగాంచిన గౌతమ్‌ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరోసారి విస్తరించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయ రంగంలో వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.95,000 కోట్ల నుంచి రూ.96,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ విమానాశ్రయ విభాగాధిపతి జీత్‌ అదానీ తెలిపారు.

Gautam Adani New Innovation

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్, నవీ ముంబయిలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయాన్ని అక్టోబర్‌లో అధికారికంగా తీసుకోనుంది.

నవీ ముంబయిలో భారీ ప్రాజెక్టు

నవీ ముంబయిలో రూ.19,000 కోట్లతో తొలి దశలో నిర్మాణం జరుగుతోంది. ఇది సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఉంటుంది. భవిష్యత్‌లో టీ2 టెర్మినల్‌కు రూ.30,000 కోట్లు నుంచి రూ.45,000 కోట్ల దాకా పెట్టుబడి పెట్టి, 3 నుండి 5 కోట్ల వరకు ప్రయాణికుల సామర్థ్యానికి విస్తరించే ప్రణాళిక ఉంది.

ఇతర విమానాశ్రయాల్లో అభివృద్ధి

ముంబయి విమానాశ్రయంతో పాటు అహ్మదాబాద్‌, జయపుర్‌, తిరువనంతపురం, లఖ్‌నవూ, గువహటి నగరాల్లోనూ కొత్త టెర్మినళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గువహటిలో కొత్త టెర్మినల్‌ను అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు జీత్‌ అదానీ వెల్లడించారు.

దేశీయ విస్తరణకే ప్రాధాన్యం

విమానయాన రంగం భారతదేశంలో వచ్చే 10-15 ఏళ్లలో భారీగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నందున, ఇతర దేశాల కంటే దేశీయంగా విస్తరణకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో భాగస్వామిగా అదానీ గ్రూప్‌ ముందడుగు వేస్తోంది.

ఈ ప్రణాళికలతో భారత విమానయాన రంగ అభివృద్ధిలో అదానీ గ్రూప్‌ కీలక పాత్ర పోషించనుంది.

Also Read : IMF Gita Gopinath Shocking : ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా భారత సంతతికి చెందిన ‘గీతా గోపీనాథ్’ రాజీనామా

Exit mobile version