Speaker Gaddam Prasad Clear Update : 19, 20 తేదీల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

షెడ్యూల్‌ ప్రకటించిన స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్

Hello Telugu - Speaker Gaddam Prasad Clear Update

Hello Telugu - Speaker Gaddam Prasad Clear Update

Speaker Gaddam Prasad : హైద‌రాబాద్ : పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ప్రధానంగా స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Speaker Gaddam Prasad) ను ఉద్దేశించి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, ఆపై కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు ఇంట్లో జ‌రుపుకుంటావా లేక జైలులో ఉంటావో తేల్చుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. వారం రోజుల్లోపు గ‌నుక చ‌ర్య‌లు తీసుకోక పోతే కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కు వ‌స్తుంద‌ని, జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. స్పీక‌ర్ ప‌ద‌వి అనేది రాజ్యాంగం క‌ల్పించిన ర‌క్ష‌ణ కానే కాద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికి ఇచ్చిన గ‌డువు చాల‌ని, ఇంకెంత స‌మ‌యం కావాలంటూ ప్ర‌శ్నించారు. దీంతో దెబ్బ‌కు దిగి వ‌చ్చారు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విష‌యంలో విచారించేందుకు రెడీ అయ్యారు.

Speaker Gaddam Prasad Key Comments on Defected MLA’s Case

ఇందులో భాగంగా దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు స్పీక‌ర్. ఈ నెల 19న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌, 20న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు క్రాస్ ఎగ్జామినేష‌న్ ముందుకు రావాల‌ని ఆదేశించారు. స్పీక‌ర్ ఆదేశాల మేర‌కు నోటీసులు జారీ చేసింది అసెంబ్లీ కార్యాల‌యం. ఇదిలా ఉండ‌గా కోర్టు చేసిన కామెంట్స్ ప‌ట్ల స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీశాయి. మూడు నెలల్లోగా తేల్చాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించక పోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులను స్పీకర్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ హోదాలో విచారిస్తారని గుర్తు చేసింది. కాబట్టి ఎలాంటి రాజ్యాంగ పరమైన రక్షణలు ఉండబోవని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read : Telangana Govt Important Update : ప్ర‌స్తుతానికి గ్రామ పంచాయ‌తీల‌కే ఎన్నిక‌లు

Exit mobile version